Funnotes Logo
Home Sai Satcharitra Talapatram
Back See My Guestbook Sign My Guestbook

Topic 33

శ్రీ సాయిబాబా షేజ్ హారతి
Shri Saibaba Shej Haarathi

చేకొనవయ్య హారతులివిగో సద్గురునాథ స్వామి సాయినాథ
పంచతత్త్వముల హారతులివిగో పండరినాథ

నిరాకారమౌ దైవముమాకై రూపముదాల్చె బాబా రూపముదాల్చె
విశ్వరూపమై సర్వమంతట సాయిగ మారే
చేకొనవయ్య హారతులివిగో సద్గురునాథ స్వామి సాయినాథ
పంచతత్త్వముల హారతులివిగో పండరినాథ

సత్త్వరజోస్తమోగుణమ్ములె మాయాశృజనములె బాబా మాయాశృజనములె
మాయలలోని మర్మములేవో తెలియును నీకే
చేకొనవయ్య హారతులివిగో సద్గురునాథ స్వామి సాయినాథ
పంచతత్త్వముల హారతులివిగో పండరినాథ

సప్తసాగరములె మీ ఆటలస్థానములాయె బాబా స్థానములాయె
ఆడుచుంటివట అనంతమౌనీ లీలలతోటి
చేకొనవయ్య హారతులివిగో సద్గురునాథ స్వామి సాయినాథ
పంచతత్త్వముల హారతులివిగో పండరినాథ

భ్రహ్మాండమ్మును సృష్టించెనుగా బాబా మాకై స్వామి నీవే మాకై
కృపామయుండె నా స్వామి అని తుకారాము పాడే
చేకొనవయ్య హారతులివిగో సద్గురునాథ స్వామి సాయినాథ
పంచతత్త్వముల హారతులివిగో పండరినాథ

హారతి జ్ఞానరాజా మహా కైవల్యతేజ
సేవించుచుండిరంత సాధు సంత భక్తులంత

హారతి జ్ఞానరాజా మహా కైవల్యతేజ
పాండురంగడే వెలిసే ఇలజ్ఞానమ్ము తెలుప

హారతి జ్ఞానరాజా

గోపికలే నిలిచే ఘన హారతులివ్వ
నారద తుంబురులే శ్రావ్యగానాలు పాడె
హారతి జ్ఞానరాజా మహా కైవల్యతేజ
సేవించుచుండిరంత మనసానందమొంద
హారతి జ్ఞానరాజా

ఈ సృష్టి మర్మమేలె విశ్వబ్రహ్మవయ్య రామకృష్ణసాయి కనికరించుమయ్య
హారతి జ్ఞానరాజా మహా కైవల్యతేజ
సేవించుచుండిరంత సాధు సంత భక్తులంత
హారతి జ్ఞానరాజా

హారతి తుకారాయా
స్వామి సద్గురురాయా సత్ చిదానందమూర్తి శరణము సాయిమూర్తి
హారతి తుకారాయా

రామమహిమ తేలె రాళ్ళసంద్రమెటులో అటుల కాచినావె దివ్య అభంగములనె
హారతి తుకారాయా
స్వామి సద్గురురాయా సత్ చిదానందమూర్తి శరణము సాయిమూర్తి
హారతి తుకారాయా

పరబ్రహ్మనీవే స్వామి మహిమావతారా రామేశ్వరుడు వేడే నిను శరణమ్ములంటు
హారతి తుకారాయా
స్వామి సద్గురురాయా సత్ చిదానందమూర్తి శరణము సాయిమూర్తి
హారతి తుకారాయా

జయ జయ సాయినాథ రామ శయనించు మందిరమందు
జయ జయ సాయినాథ రామ శయనించు సుఃఖముగ స్వామి
ప్రియమారా ఇచ్చితిమి మా సాయకి షేజారతి

జయ జయ సాయినాథ రామ శయనించు మందిరమందు
రంజిల్లునయ్య మామది అంత మథుర వచనముల నీదు పలుకుల (౨, 2)
వ్యాధుల బాధల తీర్చెదవయ్య నీ నిజ భక్తుల కనికరముంచి (౨, 2)
ఆపదలందున ఆభయమునీవై ఆశ్రయమొసగి లాలించెదవు (౨, 2)
ఆలసిపోయె నీ దేహమంత నీ భక్తుల బాధలు తీర్చగ

జయ జయ సాయినాథ రామ శయనించు మందిరమందు
ప్రియమారా ఇచ్చితిమి మా సాయకి షేజారతి
జయ జయ సాయినాథ రామ శయనించు సుఃఖముగ స్వామి
క్షమాశయనమే నీదుసెయ్య సుందరముగ పుష్పాలకూర్చితిమి(౨, 2)
సేవించగ నిను చేరితిరయ్య నిను దర్శించగ వేడితిరయ్య(౨, 2)
పంచప్రాణముల వత్తులు చేసి పంచ హారతులు ఇచ్చితిరయ్య(౨, 2)
సుగంధ పరిమళ భరితమాయె నీ భక్తకోటి ఆ సేవలు

జయ జయ సాయినాథ రామ శయనించు మందిరమందు
ప్రియమారా ఇచ్చితిమి మా సాయకి షేజారతి
జయ జయ సాయినాథ రామ శయనించు సుఃఖముగ స్వామి
నీచరణమ్ములె వీడగబోవ మా మది నొచ్చెను మరి మరి స్వామి(౨, 2)
అనుమతి వేడితి స్వీకరించి నీ ప్రసాదమున నివాసమేగ(౨, 2)
తెలవారక మునురే తిరిగొచ్చి నీ చరణమ్ముల వ్రాలెదమయ్య(౨, 2)
సుప్రభాతమ్ నీ సేవ చేయగ శుభములు మాకు కలుగునయ

జయ జయ సాయినాథ రామ శయనించు మందిరమందు
ప్రియమారా ఇచ్చితిమి మా సాయకి షేజారతి
జయ జయ సాయినాథ రామ శయనించు సుఃఖముగ స్వామి

నిదురించు మా స్వామి సుఃఖముగ నీవయ్య బాబా సాయి రామయ్య
చిన్మయరూప ఏకాంతముగ నిదురించుము ఈశ

వైరాగ్యమనే కుంచెను తుడిచి శుచిగా చేసితిమి భవనము శుచిగా ఉంచితిమి
ప్రేమగ మనసున భక్తి జలముమను చుట్టూ జల్లితిమి
నిదురించు మా స్వామి సుఃఖముగ నీవయ్య బాబా సాయి రామయ్య
చిన్మయరూప ఏకాంతముగ నిదురించుము ఈశ

నవవిధ భక్తి పానుపున శయనించుము స్వామి, స్వామి సాయిబాబా
జ్ఞాన జ్యోతియే దివ్వెగ వెలదా శయ్యను నిదురించు
నిదురించు మా స్వామి సుఃఖముగ నీవయ్య బాబా సాయి రామయ్య
చిన్మయరూప ఏకాంతముగ నిదురించుము ఈశ

సద్భావమనే పువ్వులనే సుఃఖ పాన్పున పరచితిమి, బాబా పాన్పున పరచితిమి
భక్తిశ్రధ్ధలను పానుపు చుట్టూ ఆలంకరించితిమి
నిదురించు మా స్వామి సుఃఖముగ నీవయ్య బాబా సాయి రామయ్య
చిన్మయరూప ఏకాంతముగ నిదురించుము ఈశ

ద్వైతక వాటము భంధన చేసి తెరలను దించితిమి, బాబా తెరలను దించితిమి
మనసుల చెడుల ముడులే తొలగె సుఃఖముగ శయనించు
నిదురించు మా స్వామి సుఃఖముగ నీవయ్య బాబా సాయి రామయ్య
చిన్మయరూప ఏకాంతముగ నిదురించుము ఈశ

ఆశాకోరిక మోహావేశములన్ని వదలివవి, బాబా అన్ని వదలినవి
దయ క్షమ శాంతి నిను సేవించక వేచినవి
నిదురించు మా స్వామి సుఃఖముగ నీవయ్య బాబా సాయి రామయ్య
చిన్మయరూప ఏకాంతముగ నిదురించుము ఈశ

నిష్కామమనే శాలువ పరచి పవలింపగ జేసి, బాబా పవలింపగ జేసి
సుఃఖముగ నీవే నిదురించవయ స్వామి సాయినాథ
నిదురించు మా స్వామి సుఃఖముగ నీవయ్య బాబా సాయి రామయ్య
చిన్మయరూప ఏకాంతముగ నిదురించుము ఈశ

శ్రీ సత్ చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రీ గురుదేవ దత్త

దొరికేనయ్య సాయీశ నీ ప్రాసాదమ్మె మాయీశ
మా జన్మ ధన్యమాయే కోరికలే వేరే మాకు

వచ్చెదమయ్య సాయీశ సుఃఖ నిదురను పొమ్మా పరమేశ
మా జన్మ ధన్యమాయే కోరికలే వేరే మాకు

దర్శన భాగ్యము నిమ్మా తిరిగి వేకువలోనే స్వామి
మా జన్మ ధన్యమాయే కోరికలే వేరే మాకు

సాయిరామ సాయిరామ సద్గురు దేవ సాయ సద్గురు దేవ
సుఃఖముగ నీవు శయనించ వయ సాయీ దేవ

తలచిన చాలు తొలగింతు వయ కష్టములెల్ల, మా కష్టములెల్ల
ఆపద్భాందవ స్వామి సాయి హాయిగ నిదురించు

సాయిరామ సాయిరామ సద్గురు దేవ సాయ సద్గురు దేవ
సుఃఖముగ నీవు శయనించ వయ సాయీ దేవ

తీర్చగలేము నీ ఋణములనే సాయి గోపాలా, దేవ సాయి గోపాలా
భాగ్యము నీవే బంగరు తండ్రి హాయిగ నిదురించు

ప్రభో సాయి లేచెదమయ్య వేకువ ఝామునే, స్వామి వేకువ ఝామునే
నీ సుభ దర్శనమొసగుము స్వామి మమ్ములనేలగనే

సాయిరామ సాయిరామ సద్గురు దేవ సాయ సద్గురు దేవ
సుఃఖముగ నీవు శయనించ వయ సాయీ దేవ

శ్రీ సత్ చిదానంద సద్గురి సాయినాథ్ మహారాజ్ కీ జై

రాజాధి రాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రీ సత్ చిదానంద సద్గురి సాయినాథ్ మహారాజ్ కీ జై||
V Rama Aravind.
2006-08-29.
Posted on: 2006/08/30.
Top

© 2003 - 2023, Rama Aravind Vorray, Inc. Site Last Updated: 2023-04-08. Contact Me