Topic 14
గాయం
||నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం||
గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి
గొఱ్ఱె దాటు మందకి విజ్ఞాన బోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామ బాణమార్పిందా రావణ కాష్ఠం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
||నిగ్గ||
పాత రాతి గుహలు పాల రాతి గ్రుహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడి వీధికి నడిచొస్తే వింత
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్ధాలు చదవలేద ఈ అరణ్యకాండ
||నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం||
ఈ గాయం గేయం మనలో ప్రతి ఒక్కరు మన మనసులో వేసుకోవాల్సిన ప్రశ్న. ఇది మన ప్రస్తుత పరిస్తుతుల్కి అద్దం కాదు. ఒకప్పుడు మన అందరిని బాధపరిచిన గాయం ఈ గేయం. ఎంతో మంది మహానుభావులు మన పరిస్తుతుల్ని మెరుగుపరచారు, వారి సహాయంతో మనం ఈనాడు మన దేశంలో ఎంతో అభివృధ్ధిని తీసుకువచ్చాం.
కాని మనం ఈదింది చిన్ని కాలువ మాత్రమే, మన ముందున్నది మహాసముద్రం. ఎన్నో వలయాలతో నిండియున్నది. ఈ వలయాలే నేడు మన దేశాన్ని పట్టి పీడిస్తున్న అవిద్య, అనారోగ్యం, పేదరికం. నేడు మన దేశంలో ఉన్న విద్యావంతుల సంఖ్య గతంలో మన దేశంలో ఉన్న విద్యావంతుల సంఖ్యకంటే ఎన్నో రెట్లు ఎక్కువ.
ప్రతి యౌక్క విద్యావంతుడు తన కర్తవ్యం దైవంతో సమానంగా భావించి నిర్వహించాలి. మన దేశాన్ని సాంకేతికంగా, వ్యవసాయికంగా, అన్నిటికీ మించి ఆర్ధికంగా అభివృధ్ధి పరచాలి. అబ్దుల్ కలాం, మన్మోహన్ సింగ్, అమర్త్య సేన్ లాంటి వారు మన దేశ ప్రతిష్ఠను ఉన్నత స్థానానికి చేర్చారు. దానిని ముందుకు నడిపించాల్సిన భాద్యత
పౌరుడిగా మన ప్రతి యౌక్కరి పైన ఉన్నది. గీతాంజలి సృష్ఠికర్త రవీంద్రనాథ్ ఠాగూర్ అన్న మాటలు ఒక్కసారి గుర్తుకుతెచ్చుకుందాం, "ఎటువంటి అన్యాయం, అధర్మం, భయం, మూఢనమ్మకాలూ లేని దిశలోకి, భగవంతుడా, నడిపించు నా ఈ దేశాన్ని". జై హింద్.
If you have any comments on this or would like to say something about this, then feel free to key in your comments by cliking on the link provided on right hand side of this table.
Source: Telugu feature film Gayam Lyric Writer: Sirivennela Seetaramashastry. The stanzas above other than the paragraph below it are just a pun of one of the songs in the movie and nothing has been redistributed or copied here from the movie. Copyrights are solely
vested with the owners of the respective feature film.
-వ రామా అరవింద్. రచించిన తారీకు - ౨౧-౦౬-౨౦౦౫.
V Rama Aravind.
written on:21-06-2005.
posted on:27-10-2005.
|