Topic 27
Shri Shirdi Saibaba Ekadasa Sutramulu
శ్రీ షిరిడీ సాయిబాబా ఏకాదశ సూత్రములు
1. షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖపరిహారము.
2. ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి, ద్వారకామాయి ప్రవేశమొనరించునంతనే సుఖసంపదలొందగలరు.
3. ఈ భౌతిక దేహానంతరము సైతము నే నప్రమత్తుడనే.
4. నా భక్తులకు రక్షణము నా సమాధినుండియే వెలువడును.
5. సమాధినుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును.
6. సమాధానుండి నా మానుష శరీరము మాటలాడును.
7. నన్నాశ్రయించువానిని, నన్ను శరణు జొచ్చినవానిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము.
8. నాయందెవరి దృష్టి గలదో, వారియందే నాయొక్క కటాక్షము కలదు.
9. మీ భారములను నాపై బడవేయుడు; నేను మోసెదను.
10. నా సహాయమును గాని, సలహాను గాని కోరినచో తత్ క్షణమే యొసంగెదను.
11. నా భక్తుల గృహములయందు "లేమి" యను శబ్దము పొడసూపదు.
V Rama Aravind,
2006-05-15.
Posted on: 2006-05-16.
|